సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించారు. మంగళవారం సీతానగరం , బలిజిపేట పీహెచ్‌సీ ఆవరణలో స్థానిక ఎస్‌బీఐ శాఖ మంజూరు చేసిన రూ.8లక్షలు విలువైన వైద్య పరిక రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జగన్మోహనరావు, పీహెచ్‌సీ వైద్యాధికారిణి క్రాంతి కిరణ్మయి, జనార్ధన్‌రావు, ఎంపీడీవో విజయలక్ష్మి, టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, పెంకి వేణుగోపాల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.