ఆశా వర్కర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఆశావర్కర్లు మంగళవారం నల్లబ్యాడ్జీలతో సాలూరు పీహెచ్‌సీల వద్ద నిరసన చేశారు. పీహెచ్‌సీల్లో ఆశా వర్కర్ల సమావేశాలు సందర్భంగా సాలూరు మండలంలో మామిడిపల్లి, బాగువలస, తోణాం పీహెచ్‌సీల వద్ద వారు ఆందోళన చేశారు. అనంతరం మామిడిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి శివకుమార్, తోణాం వైద్యాధికారి సుజాత తదితరుల కు వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత ఎన్‌వై నాయుడు తదితరులు పాల్గొన్నారు.