పోషణ అభియాన్ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో టి.జగన్మోహన్‌రావు సూచించారు. ఈసందర్భంగా ఆయన డీపీఎంవో డా.రఘు కుమార్‌తో కలిసి శంబర, మక్కువ, బలిజిపేట, అరసాడ పీహెచ్‌సీలు, సాలూరు పీపీ యూనిట్‌ను మంగళవా రం సందర్శించారు. ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో దృష్టి సారించాలని కోరారు. రక్తహీనత గుర్తించిన గర్భిణులు, బాలింత లు, శిశువులు, కిశోరబాలికలు, మలేరియా, డెంగ్యూ, తదితర సీజనల్ జ్వరాల వివరాల జాబితాను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తూ సత్వరమే చికిత్స అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.