తుపాన్ కారణంగా మరణాలు సంభవించడం దురదృష్టకరమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. తోటి మనుషులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి గురజాడ స్పూర్తితో తన వంతు సహాయాన్ని అందించానన్నారు. చైతన్యంతో ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్నవారికి తోచిన విధంగా అందరూ సహాయాన్ని అందించాలని చేతులు జోడించి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. వారికి అండగా నిలవాలని కోరారు. సమాజంలో ఆకలి, అశాంతి ఉంటే ఎంత సంపద ఉన్నా మనం అనుభవించలేమనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆర్థిక సహాయాన్ని అందించిన జస్టిస్ ఎన్వీ రమణకు రెండు రాష్ట్రాల ఆర్సీలు కృతజ్ఞతలు తెలిపారు.