ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి సిద్ధమైన అయిన కీర్తి సురేష్..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 10:14 PM

అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. 


కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే పేరును సాధించుకుంది. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.  కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకుపైగానే సినిమాలు ఉన్నాయి.ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్‌కు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తన చెల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై కీర్తి సురేష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన అవి నిజమనే నమ్ముతారు. అందుకే అలాంటి రూమర్స్‌పై నేను స్పందించనని చెప్పుకొచ్చింది.సోషల్ మీడియాలో వచ్చే వార్తలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని కీర్తి సురేష్ అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com