రాష్ట్రంలో పెట్రోల్, డీజల్ పై వ్యాట్ శాతం తగ్గించాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజల్ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు సెస్సు అందుకు కారణమన్నారు. పెట్రోల్, డీజల్ పై ఉన్న 5శాతం వ్యాట్ తగ్గించి, అదనపు వ్యాట్ రద్దు చేయాలని కోరారు.