దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ నరసింహన్
ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అమ్మవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందించి అర్చకులు ఆశీర్వదించారు.
ఏపీ టూర్ లో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బెజవాడ దుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వాములను దర్శించుకున్నారు. నరసింహన్ వెంట ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు ఉన్నారు. రెండు ఆలయాల దగ్గర గవర్నర్ కు ఘనస్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు నరసింహన్.
![]() |
![]() |