జాతీయ రహదారి మూసివేత

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 02:51 PM
 

ఇవాళ జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షంతోపాటు ఎడతెరిపి లేకుండా మంచు కూడా పడుతుండటంతో ప్రధాన రహదారుల వెంబడి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఉత్తర భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా యంత్రాంగం ఆ మార్గం వెంబడి రాకపోకలను నిలిపివేసింది.