హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా చిత్తూరు చేరిన కృష్ణా జలాలు

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 02:04 PM
 

అనంతపురం జిల్లా సరిహద్దు బొంతలపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాల రాకతో చిత్తూరు జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాలు చిత్తూరుకు రావడంతో జిల్లా రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. కృష్ణా జలాలతో చిప్పిలి, పుంగనూరు జలాశయాలను నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జలాల ద్వారా చిత్తూరు జిల్లాలోని 38 మండలాలకు లబ్ది చేకూరనుంది. ఏడు నియోజకవర్గాల్లోని బీడు భూములకు సాగునీరు అందనుంది.