2జి కుంభకోణం దర్యాప్తు చేస్తున్న 20 మంది అధికారుల బదిలీ

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 12:25 PM
 

న్యూఢిల్లి : సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం నాగేశ్వరరావు తమ సంస్థలో 20 మంది అధికారులను బదిలీ చేశారు. వీరిలో 2జి కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న వివేక్‌ ప్రియదర్శి కూడా ఉన్నారు. వివేక్‌ను ఢిల్లిలోని అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేశారు. కోర్టుల ఆదేశాల ప్రకారం ఏ కేసునైనా పర్యవేక్షించడం, దర్యాప్తు చేయడం వంటి విధుల్లో ఉన్న వారు ఆ విధులను యధావిధిగా కొనసాగించవచ్చునని బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.