కోస్తా, రాయలసీమల్లో చలిగాలులు

  Written by : Updated: Tue, Jan 22, 2019, 12:10 PM
 

విశాఖపట్నం : కోస్తా, రాయలసీమల్లో చలి పెరిగింది. ఒడిశాలో నెలకొన్న అధిక పీడన ప్రభావంతో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. సోమవారం చింతపల్లిలో 8.5, ఆరోగ్యవరంలో 13, అనంతపురం, విశాఖ ఎయిర్‌పోర్టులో 15 డిగ్రీలు నమోదైంది. కాగా కోస్తాలో మంచు ప్రభావం కూడా కొనసాగింది. మచిలీపట్నంలో విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో చలి, మంచు కొనసాగుతాయని తెలిపింది. కాగా తూర్పుగాలులు, వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో ఈనెల 26 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.