చదువుల ఒడి వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 22, 2019, 12:00 PM
 

అమరావతి: చదువులఒడి కార్యక్రమం వెబ్ సైట్ ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు  ప్రారంభించారు.  విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి వెబ్ సైట్ ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, పి.నారాయణ  పాల్గొన్నారు.  బడి బయట వున్న బాలికలను మళ్లీ బడిలోకి రప్పించెందుకు వుద్దెశించి అమలుచేస్తున్న కార్యక్రమం చదువుల ఒడి అన్నారు.  అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు చొరవతో ఈ కార్యక్రమం అమలు చేయనున్నామని అన్నారు.  బాలికలను మళ్లీ బడికి రప్పించడంలో యీ కార్యక్రమం ద్వారా గత మూడు సంవత్సరాలుగా సత్ఫలితాలు జరగనున్నాయి.