పాలకొండ మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి యున్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఆలయ ఈవో కే. సర్వేశ్వరరావు, ఆలయ అర్చకులు ఎస్. సంగమేశ్వరరావు, పర్రి ప్రసాద్‌ల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిగింది. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామంతల దామోదర్ రావు, ఆలయ అర్చకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.