ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న ఐదు వాహనాలను దర్శి బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ శనివారం పట్టుకున్నారు. ఒక్కో వాహనానికి రూ. 20వేల చొప్పున జరిమానా విధించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెహికల్ పత్రాలు కలిగి ఉండాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు. ఇకనుంచి నిరంతరం తనిఖీలు జరుగుతాయని చెప్పారు.