వంగవీటి రాధా టీడీపీలోకి వస్తే స్వాగతిస్తాం: బుద్దా

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 09:09 PM
 

వైసీపీకి వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను రాధా ప్రకటిస్తానన్నారు. దీంతో ఆయన ఏ పార్టీవైపు వెళతారనే చర్చ మొదలయ్యింది. అయితే వంగవీటి టీడీపీలో చేరితే స్వాగతిస్తామన్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. రాధా రాజీనామాపై విజయవాడలో స్పందించిన వెంకన్న.. చంద్రబాబు పార్టీలోకి ఎవరిని తీసుకున్నా కలిసి పనిచేస్తామన్నారు. రాధా టీడీపీలో చేరితే పార్టీ మరింత బలపడుతుందన్నారు. వంగవీటి టీడీపీలోకి వస్తారన్న సమాచారం తనకు లేదన్నారు వెంకన్న. వంగవీటి రాధాకృష్ణకు, దేవినేని కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని అంతా ప్రశాంతంగా ఉందన్నారు. వైఎస్ జగన్ వైఖరి నచ్చక త్వరలోనే మరికొందరు నేతలు పార్టీ వీడతారని బుద్దా చెప్పారు. వైసీపీలో జగన్ చెప్పిందే వేదమని.. ఆయన ఎవరి మాట వినరన్నారు. ఆ హింస భరించలేక చాలా మంది బయటకు వస్తున్నారన్నారు.