మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 11:42 AM
 

న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాయావతి ఒక హిజ్రా అంటూ బీజేపీ ఎమ్మెల్యే సాధనా  సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం  రేపాయి. కోల్ కతాలో విపక్షాల ర్యాలీకి మాయావతి  దూరం జరిగిన నేపథ్యంలో సాధనా సింగ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మాయావతి ఆడా కాదు, మగా  కాదు అంటూ వ్యాఖ్యానించారు. అటువంటి  వారి వల్లే రాజకీయాలో మహిళలందరికీ అవమానం జరుగుతోందని సాధనా సింగ్ అన్నారు.