కుంభమేలా-పుణ్య త్రివేణి సంగమంలో స్నానమాచరించిన భక్తులు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 11:33 AM
 

కుంభమేలా సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేలాకు వచ్చే వారి కోసం అత్యాధునిక కాటేజీలను నిర్మించారు. వేదిక్ నగరంలో అత్యాధునిక  సౌకర్యాలతో కూడిన కాటేజీలను నిర్మించారు. అలాగే కుంభమేలాకు వచ్చే భక్తుల కోసం హోటల్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అధికారులు తెలిపారు.