అనుమానాస్పద స్థితిలో బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ థాకరే మృతి

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 11:30 AM
 

బీజేపీ ఎమ్మెల్యే మనోజ్ థాకరే అనుమానాస్పద స్థితిలో ఈ ఉదయం మరణించారు.  బ్వాల్వాడీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మ నోజ్ థాకరే ఈ ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఆ తరువాత ఆయన మృతదేహాన్ని వర్లే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైదానంలో కనుగొన్నారు. ఆయన హత్యకు గురైనట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మందసౌర్ మునిసిపల్ కార్పోరేషన్ చైర్మన్ ప్రహ్లాద్ బంద్వార్ హత్యకు గురైన వారం రోజులకే బాల్వాడీ ఎమ్మెల్యే మనోజ్ థాకరే అనుమానాస్పద  స్థితిలో మరణించడం గమనార్హం.