మరింత పెరిగిన వాయు కాలుష్యం

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 11:16 AM
 

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. దీంతో శ్వాస సంబంధిత రుగ్మతలకు గురయిన వారి సంఖ్య పెరిగింది. కాలుష్యం బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండు మూడు రోజులలో  పరిస్థితి  మరింత  క్షీణించే అవకాశం  ఉందని  హెచ్చరిస్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా ఉదయం పదకొండు గంటలకు కూడా  హస్తినలో వాహనదారులు ఫ్లడ్ లైట్లు  వేసుకుని ప్రయాణించాల్సిన  పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.