అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 11:13 AM
 

న్యూఢిల్లీ : బీజేపీ  జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న అమిత్ షా కొద్ది  రోజుల కిందట ఢిల్లీలోని ఓయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం   కోలుకోవడంతో అమిత్ షాను నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అమిత్ షా అస్వస్థతకు గురైన కారణంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన  రద్దైంది. ఆయనకు బదులుగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్  పర్యటించారు. ఇలా ఉండగా అమిత్ షా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నిర్వహించ తలపెట్టిన పాదయాత్రలో ఆయన  పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.