23న విశాఖకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 10:46 AM
 

అమరావతి:  జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి సారించారు. ఈ నెల 23న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కేంద్రంగా పవన్‌ కల్యాణ్‌ 23 నుంచి 25 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్షించనున్నారు.