‘ఫిట్ నెస్ చాలెంజ్’, ‘గ్రీన్ చాలెంజ్’, ‘కికి చాలెంజ్’, ‘ఐస్ బకెట్ చాలెంజ్’లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు సరికొత్త చాలెంజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పదేళ్ల కిందటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘టెన్ ఇయర్స్ చాలెంజ్’ వచ్చింది. ప్రముఖుల నుంచి సామాన్యుల దాకా ఈ ‘సవాలు’ విసురుతున్నారు ఈ చాలంజ్ కింద.. పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేయాలి. ఇక ఇప్పటికే సెలబ్రిటీలు, నెటిజన్లు తమ ఫోటోలను షేర్ చేస్తూ, పదేళ్లలో ఏం జరిగిందో ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు తమ స్నేహితులకు చాలెంజ్ విసురుతున్నారు. ఇది ఎంతో సరదాగా ఉందని, గత జ్ఞాపకాలను నెమరువేసుకునే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కష్టాల్లో ఉన్నప్పటి ఫొటోలను, ఇప్పుడ విజయం సాధించిన ఫోటోలను కొందరు షేర్ చేస్తున్నాయి. అయితే కొందరు దీనిపై సటైర్లు వేస్తున్నారు. హార్లిక్స్ సీసాను, మందుసీసాను పక్కనపక్కన పెడుతున్నారు. కొన్ని బూతు చిత్రాలను కూడా షేర్ చేస్తున్నారు.