అంతర్రాష్ట్ర బదిలీలపై కేసీఆర్‌కు జగన్ లేఖ

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 01:11 AM
 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో  అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో కోరారు. అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విన్నవించారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు జరపాలని  జగన్ విఙ్ఞప్తి చేశారు.