ట్రంప్ సలహా సంఘంలో భార‌త సంత‌తికి చోటు

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 12:48 AM
 

భారత సంతతి వ్యక్తులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలకమైన తన సలహా సంఘంలో కూడా ఓ భారతీయ అమెరికన్‌కు చోటు కల్పించాలని యోచిస్తున్నారు. శ్వేతసౌధం వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ ఉత్తర అమెరికా వ్యవహారాల అధ్యక్షుడు, ఆ గ్రూప్‌ ప్రధాన ఆర్థికాధికారి పరమేశ్వరన్‌ (50)ను ఆసియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌పై అధ్యక్షుడిగా సలహా సంఘం సభ్యుడిగా ట్రంప్‌ నియమించనున్నారని తెలిపాయి. మాజీ అధ్యక్షుడు ఒబామా నెలకొల్పిన ఈ సంఘం ఆసియా, పసిఫిక్‌ ద్వీపాల్లో నివసించే అమెరికన్ల ఆర్థిక, విద్య, ఆరోగ్య, పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తుంది