ఫిబ్రవరి నెలాఖరులోగా 1,75,000 ఇళ్లు సిద్ధం : సిఎం

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 12:46 AM
 

పేదలకు పెద్దఎత్తున గృహ నిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామని, దీనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పట్టణ పేదల గృహ నిర్మాణంపై శనివారం సచివాలయంలో టిడ్కో, మెప్మా, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు, బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రుణాల మంజూరును వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని 44 బ్యాంకులు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. గృహ రుణాల మంజూరుపై బ్యాంకులు ప్రతి రోజూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.