పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష: రజత్ కుమార్

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 08:25 PM
 

రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలో ప్రధాన కార్యదర్శి ఎస్ కే. జోషి తో సీఈఓ రజత్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్ర ఎన్నికల కమిషన్ తో ఈనెల 22 న వీడియో కాన్ఫరెన్స్ ఉందని సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికలు  ముగిశాయి అయితే ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు జరిగాయి. అదనపు బలగాలు కూడా అవసరం ఉంటే అడుగుతాం. ఓటరు నమోదు జరుగుతుంది, ఎన్నికల కమిషన్ 25 వరకు గడువు ఇచ్చింది. కానీ ఫిబ్రవరి 4 వరకు గడువు ఆడిగామ‌ని, రేపు స్పెషల్ అవగాహన సదస్సు పెడుతున్నామ‌ని, శాంతి భద్రతలు, ఎన్నికల విధులలో ఎంత మంది ఉద్యోగులు అవసరం శాంతి భద్రతల పై ఈరోజు సీఎస్ మీటింగ్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ ఓ లు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి త‌మ‌ ఓటు ఉందొ లేదో చెక్ చేసుకోవాల‌ని, త‌మ ఓటు వివరాలు కూడా సరిగా ఉన్నాయో లేవో కూడా సరి చూసుకోవాల‌ని చెప్పారు. ఇప్పటి వరకు 13 లక్షల పై చిలుకు అభ్యంతరాలు, కొత్త ఓటర్లు ఎక్కువగా వచ్చార‌ని,  గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేద‌ని, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం ఓటరు నమోదు కు ఇంకా సమయం ఉంద‌ని. అర్హులు అయిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు.