దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 05:29 PM
 

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కోల్ కతాలో తృణమూల్ అధినేత్ర మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీయేతర పక్షాల ర్యాలీలో పాల్గొన్న అనంతరం కూటమి నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీని గద్దెదించడమే తమ కూటమి లక్ష్యమని ఆయన చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే వారందరినీ అణగదొక్కడమే వారి ధ్యేయంగా కనిపిస్తున్నదని ఆయన చెప్పారు.