కెసిఆర్‌, జగన్‌ బిజెపితో ఉనట్లే : గంటా

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 04:36 PM
 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, వైకాపా అధినేత జగన్‌ బిజెపితో కలిసి ఉన్నట్లేనని మంత్రి గంటా శ్రీనివాస్‌ అన్నారు. కోల్‌కతాలో జరిగిన విపక్షాల ఐక్య ర్యాలీకి కెసిఆర్‌, జగన్‌ హాజరు కాకపోవడంపై గంటా స్పందించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనుంచి ఆహ్వానం అందుకున్నా కెసిఆర్‌, జగన్‌ ర్యాలీకి హాజరవలేదని ఆయన అన్నారు. కోల్‌కతా ర్యాలీకి వారు హాజరు కాలేదంటే వారిద్దరూ బిజెపితో ఉన్నట్లేనని ఆయన చెప్పారు.