రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది : శరద్‌ పవార్‌

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 02:45 PM
 

దేశంలో కోట్లాదిమందికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ఐదేళ్లుగా మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలను మోసం చేస్తూనే ఉందని, ప్రస్తుతం ఈ దేశ మహోన్నత రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆయన చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడిని దేశం గమనిస్తూనే ఉందని ఆయన అన్నారు. దేశంలో మార్పు సాధించడమే లక్ష్యంగా తాము ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తామెవరమూ ఏ పదవులూ ఆశించి ఇక్కడకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కూటమి ద్వారా దేశానికి కొత్త పాలన అందిస్తామని ఆయన అన్నారు.