అరవింద్ కేజ్రీవాల్, ఫరూఖ్ అబ్దుల్లా తో చంద్రబాబు చర్చలు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 19, 2019, 11:24 AM
 

కోల్ కత్తా లో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తో ఏపీ సియం చంద్రబాబు భేటీ.జాతీయ నేతలతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంతనాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి కోల్‌కతా చేరుకున్న బాబు.. దేవెగౌడ, కుమారస్వామి, ప్రఫుల్‌ కుమార్‌ మహంతాతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో విడివిడిగా సమావేశమయ్యారు. విపక్షాల భారీ ర్యాలీ అనంతరం చంద్రబాబు నేతృత్వంలో 20 పార్టీల నేతలు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణ.. రోడ్ మ్యాప్‌ను ఈ భేటీలో ఖరారు చేస్తారు.