ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్‌ఎస్‌ నాయకులను కలిస్తే కఠిన చర్యలు : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 17, 2019, 12:06 PM

రాష్ట్ర పర్యటనకు వచ్చే టీఆర్‌ఎస్‌ నాయకులను టీడీపీ నాయకులెవరైనా కలిస్తే కఠినంగా వ్యవహరిస్తానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఎలక్షన్‌ మిషన్‌ 2019పై గురువారం ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంధుత్వాలు, స్నేహం పేరుతో పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్‌ ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా నెలకొన్న పరిణామాల నేపధ్యంలో సీఎం ఈ హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో మంత్రి తలసాని తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుతీర్చుకునేందుకు దేవాలయానికి వచ్చి ఎవరైనా రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి 26 కులాలను తొగించి అక్కడి వారికి అన్యాయం చేశారని, కానీ ఏపీకి వచ్చి బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com