తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. వేసవి కావడంతో రద్దీ పెరిగింది.. దీంతో పలు రైళ్లకు అదనపు కోచ్‌లను అనుసంధానం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 20 వరకు తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లే రైలుకు మూడు థర్డ్ ఏసీ కోచ్‌లు, ఒక ఎకానమి ఏసీ కోచ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ నెల 20న సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రైళ్లకు ఒక స్లీపర్ కోచ్‌ను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 18 నుంచి 21 వరకు లింగంపల్లి- ముంబై.. అలాగే ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ముంబై - లింగంపల్లి రైలుకు మూడు థర్డ్ ఏసీ కోచ్‌లు, ఒక ఎకానమి ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 17 నుంచి సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం.. అలాగే ఈ నెల 19 నుంచి తిరువనంతపురం - సికింద్రాబాద్ రైలుకు ఒక థర్డ్ ఏసీ కోచ్ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 18, 20 తేదీల్లో సికింద్రాబాద్- విశాఖపట్నం రైలు.. ఈ నెల 19, 21 వతేదీలలో విశాఖపట్నం-సికింద్రాబాద్ రైళ్లకు థర్డ్ ఏసీ ఒక కోచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19 వరకు మచిలీపట్నం-బీదర్ రైలు.. ఈ నెల 17నుంచి 20 వతేదీ వరకు బీదర్-మచిలీపట్నం రైలుకు థర్డ్ ఏసీ ఒక కోచ్, ఒక స్లీపర్ కోచ్‌ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 18 వరకు కాచిగూడ- రేపల్లె రైలుకు, 18 నుంచి 20 వరకు రేపల్లె -వికారాబాద్ రైలుకు ఒక స్లీపర్ కోచ్ అనుసందానం చేస్తారు.
ఈ నెల 17 నుంచి 19 వరకు రేపల్లె- సికింద్రాబాద్ రైలు, ఈ నెల 18 నుంచి 20 వరకు సికింద్రాబాద్- రేపల్లె రైలు, ఈ నెల 17 నుంచి 19 వరకు సికింద్రాబాద్- భద్రాచలం రోడ్డు రైలు.. ఇటు ఈనెల 18 నుంచి 20 వరకు భద్రాచలంరోడ్డు- సికింద్రాబాద్ రైలుకు ఒక స్లీపర్‌కోచ్‌ను అదనంగా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 20 వరకు గుంటూరు-వికారాబాద్ రైలుకు ఒక స్లీపర్ కోచ్ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 16 నుంచి 20 వరకు నర్సాపూర్- ధర్మవరం రైలు.. ఈ నెల 17 నుంచి 21 వరకు ధర్మవరం-నర్సాపురం రైలుకు ఒక స్లీపర్ కోచ్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 20 వరకు నర్సాపురం-హుబ్లీ రైలు.. ఈ నెల 17 నుంచి 21 వరకు హుబ్లీ- నర్సాపరం రైలుకు అదనంగా థర్డ్ ఏసీ ఒక కోచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
![]() |
![]() |