ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కామినేని ప్రచారంలో పాల్గొన్న సినీహీరో వెంకటేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 05:34 PM

‘కైకలూరులో శ్రీనుమామను గెలిపించేందుకు వెంకీ మామ వచ్చాడు. కమలానికి ఓటు వేసి కామినేనిని గెలిపించండి’.. అంటూ సినీహీరో వెంకటేశ్‌ తన ప్రసంగంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌కు మద్దతు తెలుపుతూ కలి దిండి మండలం కలిదిండి, ఎస్‌.ఆర్పీ ఆగ్రహారం, సానారుద్ర వరం, కోరుకొల్లు, కైకలూరు మండలం వేమవరప్పాడు, తామ రకొల్లు, వింజరం, ఆచవరం మీదుగా కైకలూరులో బుధ వారం వెంకటేశ్‌ రోడ్‌షో నిర్వహించారు. అభిమానులు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. వెంకటేశ్‌ తనదైన శైలిలో అభిమానులకు అభివాదం చేస్తూ యువతను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగారు. కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు కమలం గుర్తుపై, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌కు సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కైకలూరు బైపాస్‌ రోడ్డులో గంగానమ్మ గుడి వద్ద చిన్నపిల్లవాడిని ఎత్తుకుని ముద్దాడారు. మార్కెట్‌ సెంటర్లో పోలీసులను చూస్తూ ‘నమస్తే పోలీస్‌ ఇంకా ఉన్నతంగా బతకాలి.. రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి’ అంటూ వారిని ఉత్సాహపరిచారు. కైకలూరు శ్రీశ్యామలాంబ ఆలయం వద్ద అక్కా చెల్లెల్లు, బాబు, అన్నా.. అంటూ అందరిని సంబోధిస్తూ ఆయన ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. ‘కైకలూరుకు వెంకీమామ, పెళ్లికాని ప్రసాదు, తులసి, చంటి వచ్చాడు. సినిమాలే కాదు సమాజం కూడా కావాలి. శ్రీను మామ అంటే నాకు ఎంతో ఇష్టం. ఒక్కసారి పిలిస్తే పలికే మనిషి. ఏ సమస్యనైనా పరిష్క రించగలిగన వ్యక్తి. ఎవరితో వివాదాలు పెట్టుకోవడం నేను చూడలేదు. కామినేనికి ఓట్లు వేస్తే కైకలూరు అభివృద్ధి పథంలో దూసుకు పోతుంది. ప్రజలందరూ మంచి వ్యక్తులను ఎన్ను కోవాలి. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి’.. అంటూ కోరారు. ఈ సంద ర్భంగా అభిమానులను ఉత్తేజపరుస్తూ సినిమా డైలాగులు చెప్పారు. కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘ఓట్లు అడిగేం దుకు ఇంటికి వస్తున్న వైసీపీ నాయకులను ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై నిలదీయాలి. ప్రజా ఆస్తులను జగన్‌ దోచుకోవాలని చూస్తున్నారని స్థానికంగా వచ్చే వైసీపీ నాయకులను గట్టిగా ప్రశ్నించండి. కైకలూరులో వైసీపీ పాలనలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అతని కుమారులు అడ్డు అదుపు లేకుండా అక్ర మాలు, భూదందాలు చేశారు. పుట్లచెరువు గ్రామంలో 450 ఎకరాల మధ్యలో అక్కడక్కడ భూములు కొనుగోలు చేసి మార్కెట్‌ కంటే తక్కువ ధరలకు రైతులను బెదిరించి లీజులకు తీసుకున్నారు. కైకలూరులో రౌడీలను ప్రోత్సహించి దాడులకు తెగబడ్డారు. కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే రౌడీ అనేవాడిని లేకుండా కైకలూరు ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేస్తా. ప్రజలు స్వేచ్ఛగా బతకాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, అమరావతి నిర్మాణం కావాలన్నా కూటమిని గెలిపించండి’.. అంటూ కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com