ఉరవకొండ నియోజకవర్గంలోని బెళుగుప్ప గ్రామం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక నాయుకులు, కార్యకర్తల సమావేశానికి బుధవారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టో లో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అలాగే ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.