ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే నీ ముగ్గురు భార్యల్ని తీసుకొచ్చి పరిచయం చేయి: ముద్రగడ పద్మనాభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 07:46 PM

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌ తన నటన సినిమాల్లో చూపించాలని.. రాజకీయాల్లో కాదన్నారు. పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని.. తాను ఏనాడూ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడలేదన్నారు. ఇంట్లో ఉన్న తనను పవన్‌ రోడ్డు మీదకు లాగారని.. హైదరాబాద్‌ నుంచి వచ్చి తన కుటుంబంలో చిచ్చుపెట్టారన్నారు. ముద్రగడ కూతురు అని తన కుమార్తెను అందరికీ పరిచయం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా వదిలేసిన ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కుటుంబంలో డ్రగ్స్‌ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదన్నారు. పైకి తన మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com