గుంతకల్లు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే ఆర్. జితేంద్ర గౌడ్ ను తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నియమిస్తూ ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 40 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న జితేంద్ర గౌడ్ కు ఈ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనకు అధిష్టానం పార్టీలో ఉన్నత పదవి ఇచ్చి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.