ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 30, 2024, 09:16 PM

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు...! జయవకాశాలను దెబ్బతీస్తున్న ఆయన అవినీతి చిట్టా...! ఉదయ్ ఎంపికలో జనసేనాని మిస్ టేక్ చేశారా....?  అవుననే అంటున్న కూటమి నేతలు...!

ఏపీలో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారిన నేపథ్యంలో కాకినాడ లోక్ సభ నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కాకినాడ లోక్ సభ జనసేన అభ్యర్థిగా కూటమి తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎంపికైన నాటి నుంచి నియోజకవర్గ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. దీనికి కారణం ఉదయ్ శ్రీనివాస్ పై వస్తున్న అవినీతి ఆరోపణలు, ఆయన వ్యక్తిగత వ్యవహార శైలీయేనని చెప్పవచ్చు. దీంతో కథన రంగంలోకి దిగకముందే కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో జనసేన పార్టీ అస్త్రసన్యాసం చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. కారణం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వం పట్ల కూటమి నేతల్లో మంచి అభిప్రాయం లేకపోవడమే. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హోరాహోరీగా తలపడుతున్న ఈ సమయంలో కాకినాడ లో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. దీంతో ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోనున్న జనసేన కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపు అవకాశాలు పెెద్దగా కనిపించడంలేదని టీడీపీ, జనసేన నేతలు బాహాటంగా చెబుతున్నారు. కర్ణుడి చావుకు సవాలచ్చ కారణాలన్నట్లు కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి విజయ అవకాశాలను పలు అంశాలు ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తున్నాయి.

స్థానికేతరుడు....అవినీతి మరకలు,,,;?


ఏ పార్టీ అభ్యర్థి విజయవకాశానికైనా సరే పార్టీ ఇమేజ్ తోపాటు వ్యక్తిగత ఇమేజ్ స్థానికత బలం తోడవుతాయి. ఇపుడే ఇవే అంశాలు కాకినాడ లోక్ సభ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజయవకాశాలను ప్రశ్నాార్థకంలో నెట్టేస్తున్నాయి. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ బాలు విషయంలో ఇఫుడు స్థానికత అంశం తెరపైకి వస్తోంది. అస్సలు కాకినాడతో సంబంధం లేని ఉదయ్ కు జనసేన ఎంపీ సీటు ఇవ్వడంపై జనసేన నేతలతోపాటు కూటమి తరఫున బరిలోకి దిగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున్న డ్యామేజీ అయింది. కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుండి తంగెళ్ల ఉదయ్ చెందిన ఒక్కో అవినీతి చిట్టా వెలుగులోకి వస్తూనే ఉంది, దుబాయిలో క్రికెట్ బుకీగా అరెస్ట్ అయ్యి లుకవుట్ నోటిస్ మీద ఇండియా వచ్చిన ఉదయ్ మీద పలు ఆరోపణలు ఉన్నాయి .బెంగుళూరులో డ్రగ్స్ సరఫరా చేసినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రెండు పాన్ కార్డులు కలిగి ఉండటం ఒకటే పాన్ కార్డు ఎన్నికల అఫిడవిట్ నందు పొందుపరచటంతో పలు ఆర్ధిక మోసాలు చేసాడని అరోెపణలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడిన వారికీ  కాకుండా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారని పలువురు జనసేన నాయకులు వాపోతున్నారు. నిజానిజాలు తెలియకుండా పవన్ కళ్యాణ్ గుడ్డిగా ఉదయ్ ను నమ్మరాని జనసేన శ్రేణులు ఆగ్రహానికి లోనవుతున్నారు. ఇతని కంటే మెరుగైన నేతలు జనసేన పార్టీలో కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నపటికీ ఉదయ్ కే టిక్కెట్ దక్కడం ఏమిటీ అన్న నిర్వేదం వ్యక్తంచేస్తూ భారీ ఎత్తులో పార్టీ ఫండ్ ఇవ్వటంతోనే పవన్ టికెట్ ఇచ్చినట్టు భావిస్తున్న జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు.


కాకినాడ రూరల్ నుండి పోటీ చేస్తున్న పంతం నానాజీకి టికెట్ నేనే ఇప్పించాను అని 2 కోట్ల రూపాయలు ఉదయ్ అడగటంతో ఇద్దరి మధ్య తీవ్ర రగడ మొదలైంది. దీంతో ఉదయ్ శ్రీనివాస్ మీద నానాజీ వర్గ గుర్రుగా ఉంది. ఇక కాకినాడ లోక్ సభ పరిధిలోకి వచ్చే మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే లోక్ సభ అభ్యర్థిగా బరిలోనున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కూటమి నాయకులు కనీసంగా కలిసేందుకు ఇష్టపడటంలేదని తెలుస్తోంది. తమను కాదని ఇతర నేతలను ఉదయ్ శ్రీనివాస్ ముందుగా కలవడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణుల నాయకుల మీద కనీసం అవగాహన లేని ఉదయ్ ఎన్నికల్లో ఎలా రాణిస్తారనేది ఇపుడు చర్చాంశనీయంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com