చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలను ఆపేస్తారని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. 'చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లేనని పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా మంచి పాలన అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చామని పేద విద్యార్థులు ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడేలా విద్యను అందిస్తున్నామని 2లక్షల 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇంత మంచి చేసిన మీ బిడ్డను మళ్లీ ఆదరించాలని కోరారు.