ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 12:12 PM

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గన్ని కృష్ణ తెలిపారు. కాతేరు మండలం కాతేరులో సీనియర్‌ నాయకులు గంగిన హనుమంతరావు ఆధ్వర్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన గన్ని కృష్ణ మాట్లాడుతూ ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతీఒక్కరూ బలపరచాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో బూత్‌కమిటీ సభ్యులు, ఇన్‌చార్జులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, రూరల్‌ నాయకులు బిక్కిన సాంబ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com