ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసాల బాబుకు ఓటేయ‌కండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 10:22 AM

మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మోసాల బాబుకు ఓటేయ‌కండి అంటూ ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ. మనది ఇంటింటికీ మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచిచేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడ‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పేర్కొన్నారు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నట్టుగా.. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ, ఈనాడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, టీవీ5 నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నారా?. ఎన్నికలు వచ్చాయి కాబట్టే చంద్రబాబు కూటమి ఆంధ్రరాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్‌కి వెళ్లిపోతారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టీపార్టీ. నయా ఈస్టిండియా కంపెనీ చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేద‌ని సీఎం వైయ‌స్ జగన్‌ ధ్వజమెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com