ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. రైతులు, మహిళలకు జగన్ వరాల జల్లు, పథకాల పూర్తి వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:49 PM

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోన విడుదలైంది. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు.


* అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు


* అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.


* వైఎస్సార్‌ చేయూత పథకం 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు


* రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటించారు (2028 జనవరిలో రూ.25, 2029 జనవరిలో 2029లో పెంపు)


* వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు


* వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింది రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు


* వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు


* కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు


* వైద్యం, ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరిస్తామన్న ప్రకటించారు


* రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలు పెంపు (కౌలు రైతులకు రైతు భరోసా కొనసాగింపు)


* అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు


* అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు


* ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించారు


* ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా అమలు


* లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు


* వాహన మిత్రను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు


* చేనేతలకు ఏడాదికి రూ.24 చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు


* నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌


* ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ.. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ


* స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా వర్తింపు


* ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు రుణాలు


* ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌


రాజధానికి సంబంధించి సీఎం జగన్ హామీలు


* మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిని చేస్తాం


* రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతాం


* అమరావతిని శాసనరాజధానిగా చేస్తాం


* కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం


వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో వివరాలు ఇవే


2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99శాతం నెరవేర్చామన్నారు సీఎం జగన్. ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు. తన పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని.. చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశానన్నారు. తాను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశానని.. పేదలకు సంక్షేమం అందించామన్నాు. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం అందించాం. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడమూ ఎప్పుడూ జరగలేదన్నారు.


ఏ నెలలో ఏ పథకం ఇస్తామో చెప్పి పథకాన్ని అమలు చేశామన్నారు. తాను సాధ్యమయ్యే హామీలు ఇచ్చి హీరోలా జనాల్లోకి వెళుతున్నానన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావంతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా.. ఆదాయం లేకపోయినా ఎలాంటి సాకులు చూపలేదన్నారు. మేనిఫెస్టో అమలుకు ఎన్ని సమస్యలు వచ్చినా.. చిరు నవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామన్నారు. అర్హులకు మాత్రమే పథకాలను అందించామని.. కులాలు, పార్టీలు కూడా చూడకుండా మంచిని చేశామన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించామన్నారు జగన్. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని.. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టోను ప్రతీ ఇంటికి పంపించామన్నారు. ఓ ప్రొగ్రెస్‌ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు వివరించామన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని.. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు.. నిరుద్యోగులు, మహిళలు, రైతుల్ని మోసం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో 32వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే.. తమ ప్రభుత్వ హయాంలో 2 లక్షల 31వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com