ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెయ్యగలిగిందే చెప్తాము, చెప్పింది చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 04:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు. శనివారం ఉదయం తాడేపల్లిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు.మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగు రంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ, మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చింది. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రొగ్రెస్‌ కార్డు మాదిరి ఏం ఏం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్‌ డెలివరీ చేశాం. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశాం. కానీ, 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశాం. 2014లోనూ నాకు బాగా గుర్తుంది. ఆనాడు కూడా చేయగలిగిందే చెప్పాం. అమలు చేసినా, చేయకున్నా.. చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని చాలామంది నా మంచి కోసమంటూ చెప్పారు. కానీ, నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా. ఇదీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలి. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. లీడర్‌షిప్‌ అంటే చెప్పిన ప్రతీ మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమే. నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం.  చదివించాలని ఉన్నా.. చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లారా చూశా. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పని చేశా. పేదలకు సంక్షేమం అందించాం. అర్హులను జల్లెడ పట్టి మరీ వెతికి సంక్షేమం అందించాం. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లడమూ ఎప్పుడూ జరగలేదు. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా?. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసింది. రుణమాఫీ, డ్వాక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. సున్నా వడ్డీని ఎగ్గొట్టారు. సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ నగరంలోనూ హైటెక్‌ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారు.  కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారు. సాధ్యంకాని హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా? విశ్వసనీయత లేనప్పడు రాజకీయాలు చేయడం ఎందుకు?. రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రయం  ఉండాలి. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు అవుతోంది. సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నాం. చట్టం అమలు చేసి 50 శాతం రిజర్వేషన్లతో నామినేటెడ్‌ పదవులు ఇచ్చాం. బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులిచ్చాం. 60 శాతం మంత్రి పదవులు  పేద విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేసి చూపించాం.  పంటల కొనుగోలులో దళారుల వ్యవస్థ లేకుండా చేశాం. మేం ఇచ్చిన హామీలను ఎంతో నిష్టగా అమలు చేశాం. ఎక్కడా లంచాల ప్రస్తావన లేకుండా డీబీటీ ద్వారా సంక్షేమం అందించాం.  2014-19 మధ్య 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.  గత 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం. ఆరోగ్యశ్రీ,  సంపూర్ణ పోషణ, ఫీజు రియంబర్స్‌మెంట్‌, గోరుముద్ద, ఈ పథకాలన్నీ ఆపడం ఎవరి చేత కాదు. జగన్‌ ఎంతో కష్టపడితేనే ఈ పథకాలు అమలు అవుతున్నాయి. వీటిని ఆపడం, తొలగించడం ఎవరి వల్ల కాదు. చంద్రబాబు చెబుతున్న పథకాలను లక్షా 21 వేల కోట్ల రూపాయలు అవసరం. మనం  అమలు చేస్తున్న పథకాలకు ఏడాదికి 29 వేల 100 కోట్లు ఖర్చు చేయాల్సిందే. అంటే.. చంద్రబాబు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ 10 హామీలకు మన సంక్షేమ పథకాల కలిపి అమలు అమలు చేయాలంటే కచ్చితంగా అక్షరాల లక్షా 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎలా సాధ్యం? అని ప్ర‌శ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com