ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 07:34 PM

ఎన్నికల అఫిడవిట్ లో ఇంటర్ అని నమోదు


బయట మాత్రం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని బిల్డప్ లు


ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్న చీకటి కోణాలు


ఎన్నికల వేళ ప్రత్యర్థులకు అందొస్తున్న అస్త్రాలు


కాకిినాడ లోక్ సభ ఎన్నికలు రంజుగా మారనున్నాయి. ఎన్నికల్లో గెలుపుకోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఈ సారి కాకినాడ లోక్ సభ ఎన్నికల్లో విమర్శల వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కేంద్ర బిందువుగా కూటమి తరఫున జనసేన కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న తంగేల ఉదయ్ శ్రీనివాస్ అంశం కాబోతోంది. తాజాగా ఆయన చదవుతోపాటు విదేశాల్లో ఆయనపై నమోదైన కేసు అంశం ఈ ఎన్నికల్లో రాజకీయ వేడిమరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి ఈ అంశం ఓ అస్త్రంగా మారబోతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తంగెల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయాలలోకి వచ్చే  సమయంలో తన గురించి తాను చేసుకొన్న ఆర్భాటపు ప్రచారమే ఇపుడు ఆయనకు శాపంగా మారబోతోంది. టీ టైమ్ శ్రీనివాస్ గా పేరొందిన తంగెల  ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ పత్రంలో ఆయన పొందుపర్చిన విద్యా అర్హత అంశంతో మొదలైన వివాదం మరిన్ని వివాదాల్లోకి ఆయన్ని నెడుతోంది. రాజకీయాలలోకి వచ్చే ముందు తంగెల ఉదయ్ శ్రీనివాస్ అతనో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అని ప్రచారం జరిగింది. హైదరాబాద్ లోని  టీఆర్ఆర్ కాలేజీలో ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చదివి ఆ తరువాత సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ గా ఉద్యోగం చేశారు. ఆ తరువాత వాటికి రాజీనామా చేసి దుబాబ్ లో వ్యాపారం చేశారన్న ప్రచారం సాగింది. ఓ రకంగా ఆయనే ఈ ప్రచారం చేసుకొన్నారని ప్రచారముంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యా అర్హత ఇంటర్ అని నమోదు చేయడంతో ఇపుడు అసలు వివాదం మొదలైంది. దీంతో ఇదే అస్త్రాలన్ని ఎన్నికల్లో ప్రయోగించాలని వైసీపీ భావిస్తోంది.


 తంగెల ఉదయ్ శ్రీనివాస్ గతచరిత్రపై ఫోకస్


ఎన్నికల అఫిడవిట్ తన విద్యా అర్హత ఇంటర్ గా పేర్కనడంతో అసలు వివాదం రాజుకొంది. ఇంటర్ చదివిన వ్యక్తికిి సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎలా వస్తుంది. అందులోనూ చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్ లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవే అంశాలను తంగెల ఉదయ్ శ్రీనివాస్ రాజకీయ ప్రత్యర్థులు లేవనెత్తుతున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు దుబాయ్ వంటి దేశంలో పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు వంటి చిన్న ఉద్యోగాలే తప్పా పెద్ద ఉన్నత ఉద్యోగాలు అసాధ్యమన్న చర్చ సాగుతోంది. దీంతో ఇంటర్ చదివిన వ్యక్తి కోట్లు ఎలా సంపాధించాడు అన్న లోతైన చర్చ సాగే క్రమంలో ఆయన అక్రమాల పుట్టను రాజకీయ ప్రత్యర్థులు తవ్వితీస్తున్నారు. దీంతో ఒక్కోక్కటిగా ఆయన నేర చరిత్ర వెలుగులోకి వస్తోంది. వాటిని ఓ సారి పరిశీలిస్తే జనసేన కాకినాడ లోక్ సభ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ అవినీతి చిట్టా కాస్త పెద్దదిగానే కనిపిస్తోంది. తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఓ మధ్య తరగతి కుటుంభానికి చెందిన వ్యక్తి ఓ ఉన్నత స్థాయికి ఎగిగారన్న ప్రచారమే ఆయన్ని లోక్ సభ అభ్యర్థి టిక్కెట్ దక్కేలా చేసింది. స్వశక్తితో పైకి వచ్చి ప్రజాసేవలో కొనసాగడంతో జనసేన పార్టీ ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చింది. కానీ ఆయన గత చరిత్ర అందుకు భిన్నంగా ఉండటమే ఇపుడు రాజకీయంగా ప్రకంకనలు పుట్టిిస్తోంది. ఇంటర్ చదివిన వ్యక్తి దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడం ఏమిటీ ఆ ఉద్యోగంతోనే కోట్లు సంపాధించడం ఏమిటీ అన్న దానిపై ఆయన రాజకీయ ప్రత్యర్థులు వాస్తవాలు వెలికితీసే పనిలో పడ్డారు. దీంతో ఆయన అక్రమాల చిట్టా ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తోంది. వాస్తవానికి దుబాయ్ లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ జాబ్ చేయలేదని క్రికెట్ బుకీ నిర్వహించేవాడని పేర్కొంటున్నారు.  అక్కడి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన తంగెల ఉదయ్ శ్రీనివాస్ పై దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చిలో కేసు నమోదు చేసి, అతని కోసం లుక్  ఔట్ నోటీసు ఇచ్చారన్న దానికి సంబంధించి కేసు వివరాల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో వాటినుంచి చాకచక్యంగా తప్పించుకొని ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి తానో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకొని దుబాయ్ లోనే తాను కోట్లు సంపాధించానని బిల్డప్ ఇస్తున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు సేకరించిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఈ ఎన్నికల ప్రచారంలో వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అంతే కాదండోయ్ మన ఉదయ్ శ్రీనివాస్ పైన స్వదేశంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు పాన్ కార్డులు తీసుకొని వివిధ కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణ ఉంది. భూ కబ్జా కేసు కూడా  ఉన్నట్లు ఆధారాలు  దొరికాయి. దీంతో ఇలాంటి అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసా అన్న ప్రచారం ఆయన ప్రత్యర్థులు చేస్తున్నారు. వైసీపీ పార్టీ ఇదే అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా మల్చుకొని వాటిని ఉదయ్ శ్రీనివాప్ పై ప్రయోగించేందుకు సిద్దమవుతున్నారు. ఈ పరిస్థితితో ఇరుకొన్న వాటిని నుంచి బయటపడే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఒక అపద్దాన్ని పదే పదే చెప్పడంతో వాటిని నిజం చేసే పనిలో కాకినాడ లోక్ సభ జనసేన అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ పడ్డారన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ  అక్రమాలు వెలుగులోకి రావడంతో జనసేన అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఇరకాటంలో పడ్డారు. ఎన్నికల సమయంలో ఈ వాస్తవాలు వెలుగులోకి రావడంతో అది ఆయన విజయ అవకాశాలను దెబ్బతీసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com