జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ ప్యాకేజీ ప్రొఫిషనల్ అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. పవన్‌కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పవన్ వాడుతున్న భాష, రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్ వ్యాఖ్యలకు మీడియా సమావేశంలో గ్రంధి కౌంటర్ మాట్లాడుతూ... జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పవన్ వాడుతున్న భాష, ఊగిపోవడం, రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్ వ్యాఖ్యలకు గ్రంధి శ్రీనివాస్ చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ ఒక రౌడీలా మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక స్థితి బాగోలేదు. పిచ్చి ముదిరిన వ్యక్తిని వైద్యులకు చూపించారో, లేదో తెలియదు. వాళ్ల అన్న చిరంజీవి కూడా తమ్ముడి పక్షాన నిలబడతాను అని ఇటీవల అన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాల్లో చిరంజీవి మద్దతు తెలపటం కాదు. చిరంజీవి, ముందుగా పవన్ కల్యాణ్‌ను ఆసుపత్రిలో చూపించాలి. కొంత కాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే, చాలా బావుంటుందని చిరంజీవికి సూచన చేస్తున్నాను. పవన్‌కు రాజకీయాల విలువలు లేవు. ఊసరవెల్లిలాగా పవన్ ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గతంలో తనను తిట్టిన వ్యక్తికే పవన్ కల్యాణ్ భీమవరం టికెట్ ఇచ్చారని గ్రంధి శ్రీనివాస్ అన్నాడు.