జనసేన అధ్యక్షుడు పవన్ ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్నారని, పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నరసాపురం,భీమవరం ఎన్నికల సభలలో ఈనెల 21 వతేదీన వైయస్ఆర్‌సీపీ నేతలు ప్రసాదరాజు,సజ్జల రామకృష్ణారెడ్డి గార్లపై ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.