జనసేన చంద్రబాబుకు ఓ భజన సేనలాగా మారిందని వైయస్ఆర్‌సీపీ మహిళా నేత, మహిళా కమీషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.....పవన్ కల్యాణ్ ను అటు భీమవరం..ఇటు గాజువాకలోను ప్రజలను తన్ని తరిమి నేలపై దేకించారు.15 ఏళ్ళుగా జనసేను ప్రజలు గుర్తించలేదు.పైగా తిరస్కరించారు.ప్రజలు పదే పదే నువ్వు చంద్రబాబుకు భజన చేస్తున్నావని చెబుతున్నా కూడా అర్దం కానట్లు పవన్ కల్యాణ్ నటిస్తున్నారు.ప్యాకేజిల కోసం ఎన్నికల సందర్బంగా వైయస్సార్ సిపి నేతలపై వీరోచితంగా మాట్లాడితే సరిపోతుందన్నట్లుగా పవన్ కల్యాణ్ వైఖరి ఉంది.అలా అయితేనే ప్యాకేజి దక్కుతుందన్నట్లుగా ఉంది. నిన్ను నమ్ముకున్న అభిమానులకు,సామాజికవర్గానికి మేలు చేసే విధంగా పవన్ కల్యాణ్ ఏ రోజు కూడా ఆలోచించడం లేదు.పవన్ కల్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు. ఆయనను నమ్ముకున్నఅమ్మాయిలకు న్యాయం లేదు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు పావలా న్యాయం చేయని వ్యక్తి పవన్.జగన్ గారు సూటిగా చెప్పారు... ఒకర్ని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు అని....నీవు(పవన్) వేసే చిల్లరవేషాలకు నిన్ను అన్నారే కాని నీ భార్యలను తిట్టినట్లు కాదు.వివాహవ్యవస్ధను,వివాహ బంధాన్ని హేళన చేస్తూ నాలుగేళ్ళకు ఒకసారి...ఐదేళ్ళకు ఒకసారి హేళన చేయడమే పనిగా పెట్టుకున్న నీకు పెళ్ళాలు,బార్యల అర్దం తెలుసా అని ప్రశ్నించారు.నీ ప్యాకేజి రాజకీయాలకోసం ఈరోజు నీ అన్న చిరంజీవిని కూడా రోడ్డుపైకి లాగుతున్నావు.చిరంజీవిగారిని ఎవ్వరూ ఏమీ విమర్శించలేదు. పవన్ కల్యాణ్ ను అంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.ఆయన సినిమా అయిపోయింది.అందుకనే చిరంజీవిగారిని తీసుకువస్తే ప్యాకేజి వర్కవుట్ అవుతుందని పవన్ కల్యాణ్ బావిస్తున్నారు.ఇది దుర్మార్గమైన రాజకీయం.ప్రజలకు న్యాయం చేస్తానని,తన అభిమానులకు న్యాయం చేసేందుకు ఒక్క పనీ చేయని వ్యక్తి పవన్ కల్యాణ్.చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్.బిజేపితో పొత్తు కుదిర్చి చంద్రబాబుకు మేలు కలిగేలా చేశాడు.జాతీయపార్టి వద్ద చంద్రబాబుకోసం నాటకాలు ఆడాడు. నీ అన్యాయానికి గురైనవారు ఆక్రోశం వెలిబుచ్చుతుంటే కనీసం రెస్పాండ్ కాని వ్యక్తి.నీ పార్టీ కోసం పనిచేసినవారిని నిర్లక్ష్యం చేస్తూ చంద్రబాబు చెప్పిన వారికి జనసేన టిక్కెట్లు కేటాయిస్తున్నందుకు సిగ్గుపడాలి.బాద్యత లేకుండా చితక్కొడదాం...చించేస్తాం..ఈడుస్తాం అనే మాటలు మీకు భవిష్యత్తు కనబడటం వల్లనే వస్తున్నాయి.భయం..వణుకు పుట్టి ఇలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు.నీ ఉడుత ఊపులకు ఇక్కడ ఎవరూ భయపడరు.ఇక్కడ ఉన్నది కోట్లాది మంది ప్రజల అభిమానం పొందిన వైయస్ జగన్..వైయస్సార్ సిపి ప్రభుత్వం అనేది గుర్తించుకోవాలి.నీలాగా పిరికిపందల పార్టీ..ప్యాకేజిల కోసం అర్రులు చాచే వ్యక్తులు కాదు.మరొకసారి చెత్త మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం. సొల్లు కబుర్లు మాని ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. 2014 లో ఉన్న నీ ప్రభుత్వం ఇది చేసిందని చెప్పే దమ్ము ఉందా....పచ్చి రౌడీలు లాగా మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు.ప్రజలు నీ తాట తీయడానికి సిధ్దంగా ఉన్నారని గుర్తుంచుకుని ప్రవర్తించాలని పవన్ కల్యాణ్ కు హితవు చెప్పారు.