టీడీపీ నాయకత్వం కొన్ని స్థానాలలో అభ్యర్థుల మార్పు నిమిత్తం పూర్తి స్థాయిలో తమ అభ్యర్థులకు బీ ఫారాలను ఈ నెల 21న పంపిణీ చేయనుంది. తమ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులను ఆ రోజున కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు వారితో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. కాగా.. శనివారం చంద్రబాబు పుట్టినరోజు. ఆయన ఆ రోజు నెల్లూరు జిల్లాలో ప్రజా గళం సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేపల్లి, ఆత్మకూరు, గూడూరు నియోజకవర్గాల్లో ఆయన సభలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటివరకూ రోజుకు రెండు సభలు పెడుతున్నారు. ఆ రోజు మాత్రం మూడు పెట్టే ఆలోచన నడుస్తోంది.