అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది. ఇక్కడ అంతకు ముందు ప్రవాసాంధ్రుడు పైలా ప్రసాదరావుకు సీటిచ్చారు. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో ప్రచారంలో వెనుకబడ్డారని అధినాయకత్వానికి నివేదికలు అందాయి. దీంతో ఆయన్ను మార్చి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేశారు.