ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభ్యర్థుల మార్పు, కూటమిలో గందరగోళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 02:31 PM

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చబోతున్నారు. ఆయన ప్రచార రంగంలో వెనుకబడిపోయారు. పైగా ప్రత్యర్థి శిబిరంతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్‌ సతీమణి సరళారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌, చిప్‌ తయారీ బహుళ జాతి సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న కొండా నరేంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. శుక్రవారం తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com