తన తండ్రిని గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. వారే ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు కుమారుడు అజిత్, కుమార్తె డా. చెల్సియాలు. గత 10 రోజుల నుండి ఐదు మండలాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించడంతో పాటు టిడిపి అందించే పథకాలను వివరిస్తున్నారు. సోమవారం దోర్నాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరికీ ఓటర్లు ఘన స్వాగతం పలుకుతూ హారతులు పడుతున్నారు.